Chinnamandem: చిన్నమండెం అరబ్ స్ట్రీట్‌లో ఘనంగా డోర్ టు డోర్ కార్యక్రమం
Chinnamandem: చిన్నమండెం మండలంలోని అరబ్ స్ట్రీట్‌లో మంత్రి మండిపల్లి సతీమణి హరితమ్మ డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
చిన్నమండెం: చిన్నమండెం మండలంలోని అరబ్ స్ట్రీట్‌లో డోర్ టు డోర్ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి సతీమని హరితమ్మ పాల్గొని స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ప్రజల నుంచి లభించిన ఆదరణ, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




