Chinnamandem: మల్లూరమ్మ ఆలయంలో శ్రీనివాస కళ్యాణం – మహా అన్నదాన ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

Chinnamandem: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మల్లూరమ్మ ఆలయంలో ఈ నెల 27న శ్రీనివాస కళ్యాణం.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 23 Aug 2026 11:28 PM IST
Chinnamandem
X

Chinnamandem: మల్లూరమ్మ ఆలయంలో శ్రీనివాస కళ్యాణం – మహా అన్నదాన ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

చిన్నమండెం: చిన్నమండెం మండలం లో శ్రీశ్రీశ్రీ మల్లూరమ్మ ఆలయ ప్రాంగణంలో ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ పవిత్ర శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి విచ్చేసే భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. సుమారు 10 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్న స్థలాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్వయంగా పరిశీలించారు. భక్తులకు సౌకర్యవంతంగా అన్నప్రసాదం అందేలా స్థలంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, కూర్చునే వసతి, అన్నప్రసాద వితరణ తదితర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చూడాలని సూచించారు.

శ్రీనివాసుని సేవలో భక్తులకు అన్నప్రసాదం అందించాలనే సంకల్పంతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ మహా అన్నదాన కార్యక్రమానికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై, శ్రీనివాసుని దర్శించుకుని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story