Chinnamandem: చిన్నమండెంలో రూ.50 లక్షలతో పశువైద్య ఆసుపత్రి!

Chinnamandem: చిన్నమండెంలో రూ.50 లక్షల వ్యయంతో పశువైద్య ఆసుపత్రి భవనానికి భూమిపూజ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రైతులకు, పశుపాలకులకు ఊరట.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 3 Aug 2026 2:47 PM IST
Chinnamandem
X

Chinnamandem: చిన్నమండెంలో రూ.50 లక్షలతో పశువైద్య ఆసుపత్రి!

చిన్నమండెం: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన పశువైద్య ఆసుపత్రి భవనానికి సోమవారం నాడు రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.

పశుపాలకులకు మెరుగైన పశువైద్య సేవలు అందించేందుకు ఈ ఆసుపత్రి ఉపయోగపడనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు మూగి రెడ్డప్ప, పెద్దిరెడ్డి మరియు మండల కూటమి నాయకులు, గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీ నాయకులు, మండల కమిటీ నాయకులు, బూత్, యూనిట్, క్లస్టర్ కమిటీల నాయకులు పాల్గొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story