Rayachoti: చిన్నమండెం జడ్పీటీసీ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డికి ఘన సత్కారం!
Rayachoti: చిన్నమండెం జడ్పీటీసీగా గెలిచిన డాక్టర్ మండిపల్లె లక్ష్మీ ప్రసాద్ రెడ్డిని రాయచోటి టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు.
Rayachoti: చిన్నమండెం జడ్పీటీసీ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డికి ఘన సత్కారం!
రాయచోటి: రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిన్నమండెం జడ్పీటీసీగా ఘన విజయం సాధించిన డాక్టర్ మండిపల్లె లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారిని పలువురు నాయకులు, పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల ఆశీస్సులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో సాధించిన ఈ విజయం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చిన్నమండెం మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ విజయం భవిష్యత్తులో మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలకు నాంది కావాలని శుభాకాంక్షలు తెలిపారు.




