Chintakunta: చింతకుంట పీహెచ్‌సీలో ఘనంగా సేవా సంకల్ప అభియాన్ వైద్య శిబిరం

Chintakunta: చింతకుంట పీహెచ్‌సీలో సేవా సంకల్ప అభియాన్ వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక ప్రజలకు ఆరోగ్య పరీక్షలు, వైద్య సలహాలు అందించిన వైద్యాధికారులు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 8 Oct 2026 4:25 PM IST
Chintakunta
X

Chintakunta: చింతకుంట పీహెచ్‌సీలో ఘనంగా సేవా సంకల్ప అభియాన్ వైద్య శిబిరం

చింతకుంట: ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందించాలనే లక్ష్యంతో చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్‌ వికసిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక, పరిసర గ్రామాల ప్రజలకు వివిధ వైద్య సేవలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందించడంతో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు, వైద్య సలహాలు అందించారు. రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధులను ముందుగానే గుర్తించేలా స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు.

అలాగే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌, అనీమియా, ప్రీ-డయాబెటిస్‌, ఆప్తాల్మిక్‌ పరీక్షలు, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, గైనకాలజీ సేవలు, హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ గుర్తింపు, పోషకాహారంపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి వైద్య సలహాలు అందించడంతో పాటు, తదుపరి చికిత్స అవసరమైన వారిని ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్‌ చేసేలా చర్యలు చేపట్టారు. ఇమ్యునైజేషన్‌ సేవలు, ఐఈసీ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ ఆరోగ్య సేవలు, పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ.. వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన వారికి సకాలంలో వైద్య సేవలు అందేలా ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.

కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి రాజగోపాల్‌, ఆరోగ్య పర్యవేక్షకులు శివ గంగరాజు, మల్లేశ్వరి, సీహెచ్‌వోలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR