Rayachoti: టీడీపీ నేత సుగవాసి ప్రసాద్ బాబును సత్కరించిన మేయర్ కటారి హేమలత!
Rayachoti: టీడీపీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబును చిత్తూరు కార్పొరేషన్ మేయర్ కటారి హేమలత మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.
Rayachoti: టీడీపీ నేత సుగవాసి ప్రసాద్ బాబును సత్కరించిన మేయర్ కటారి హేమలత!
Rayachoti: శనివారం ఉదయం రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు, గాలివీడు జడ్పీటీసీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని చిత్తూరు కార్పొరేషన్ మేయర్ శ్రీమతి కటారి హేమలత గారు టీడీపీ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు గారికి శాలువా కప్పి ఘనంగా సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అదే విధంగా సుగవాసి ప్రసాద్ బాబు గారు కూడా మేయర్ శ్రీమతి కటారి హేమలత గారిని శాలువాతో సత్కరించి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ఆత్మీయంగా ముచ్చటించుకుంటూ ప్రజా సమస్యలు, అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, పార్టీ సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై సానుకూలంగా చర్చించుకున్నారు.
పదవులు వేరు… ప్రాంతాలు వేరు… కానీ ప్రజాసేవే లక్ష్యంగా సాగుతున్న నాయకుల మధ్య ఆత్మీయత, పరస్పర గౌరవం మరింత ప్రత్యేకతను చాటింది.
టీడీపీ నాయకుల మధ్య ఐక్యత, పరస్పర సహకారం, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయంతో ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలనే ఆకాంక్ష ఈ సమావేశంలో ప్రతిబింబించింది.




