Proddatur: ఈ నెల 5న ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
Proddatur: ఈ నెల 5న ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి జల్ జీవన్ మిషన్ పైలాన్‌ను ప్రారంభించనున్నారు. అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
Proddatur: ఈ నెల 5న ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
కడప జిల్లా: ప్రొద్దుటూరులో ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరులో ‘జల్ జీవన్ మిషన్’ కార్యక్రమానికి సంబంధించిన పైలాన్‌ను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలిసి ప్రారంభించనున్నారు.
కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలు బహిరంగ సభ ప్రాంగణంతో పాటు హెలిపాడ్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, భద్రతా చర్యలను పర్యవేక్షించారు. పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర మంత్రులు నారాయణ, సవిత, ప్రొద్దుటూరు చేరుకోనున్నారు.
సీఎం, డిప్యూటీ సీఎంల పర్యటన విజయవంతం చేసేందుకు మంత్రులు జిల్లా ఉన్నతాధికారులతో మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించిన్నారు.




