Kadapa: నేడు రూ.30,000 కోట్ల జల జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన!

Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్టోబర్ 5న జరగనున్న జల జీవన్ మిషన్ శంకుస్థాపన సభకు లక్ష మంది ప్రజలు హాజరవుతారని మంత్రి సవిత తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 4 Oct 2026 1:22 PM IST
Kadapa
X

Kadapa: నేడు రూ.30,000 కోట్ల జల జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన!

Kadapa: ప్రభుత్వo పథకాలు అమలు చేస్తూనే, మరోపక్క పరిశ్రమలు, ఇరిగేషన్ పనులు, అమృత్ పనులను పరుగులు తీస్తోంది. ​ఇటీవల 'పల్లె పండుగ', హార్టికల్చర్ హబ్ లాంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ​ఈ నెల 5వ తేదీన ప్రొద్దుటూరు లో 30,000 కోట్ల రు "జల జీవన్ మిషన్" పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాధవ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తున్నాం.

ఈ బహిరంగ సభకు సుమారుగా లక్ష మంది ప్రజలు రావచ్చని అంచన్న ఉందని మంత్రి సబితా తెలిపారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రానున్న సందర్భంగా ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.. ​

ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, వైద్య సదుపాయాలు మరియు ఇతర సదుపాయాలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. ​సభకు వచ్చే ప్రజలకు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నాం. ​కూటమి ప్రభుత్వం ఇచ్చే మాటలకు, చేసే పనులకు కట్టుబడి పనిచేస్తోందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు..

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR