Kadapa: కడప మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం!
Kadapa: కడప జిల్లా మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం. నవంబర్ 1న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్. 12 రకాల గుర్తింపు కార్డులకు అనుమతి తెలిపిన కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి.
Kadapa: కడప మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం!
Kadapa: మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నవంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కడప జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. నవంబర్ 1వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది.
ఓటరు జాబితాలో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదాన్ని వెంట తీసుకెళ్లి తమ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ ఎన్నికల్లో ఓటర్లకు రెండు బ్యాలెట్ పత్రాలు అందజేయనున్నారు. గులాబీ రంగు బ్యాలెట్ పత్రం మేయర్ అభ్యర్థికి, తెలుపు రంగు బ్యాలెట్ పత్రం కార్పొరేటర్ అభ్యర్థికి ఓటు వేసేందుకు ఉంటుంది. రెండు బ్యాలెట్ పత్రాలపై ఓటు వేసిన అనంతరం వాటిని ఒకే బ్యాలెట్ పెట్టెలో వేయాల్సి ఉంటుంది.
ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్‌పోర్టు, ఉపాధి హామీ కార్డు, ఆరోగ్య బీమా కార్డు, పెన్షన్ పత్రం, ఉద్యోగ గుర్తింపు కార్డు తదితర గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదాన్ని తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.
ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు.




