Proddatur: డాక్టర్లయ్యే కలలను చిదిమేస్తారా? నీట్ కుంభకోణంపై కాంగ్రెస్
Proddatur: నీట్ పేపర్ లీకేజీపై ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా ఆగ్రహం.
Proddatur: డాక్టర్లయ్యే కలలను చిదిమేస్తారా? నీట్ కుంభకోణంపై కాంగ్రెస్
ప్రొద్దటూరు: ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి చదివి, ప్రత్యేక కోచింగ్ తీసుకుని తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పేపర్ లీక్‌ల కారణంగా పరీక్షలు రద్దు కావడం విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి, ఆందోళనతో నిరాశచెందుతున్నారు. తమ పిల్లలు డాక్టర్లు కావాలని తల్లిదండ్రులు రక్తం, చెమటోడ్చి సంపాదించిన కష్టార్జిత డబ్బును పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తున్నారు.
సంవత్సరాల పాటు కష్టపడి చదివిన విద్యార్థులు పరీక్ష పూర్తయ్యాక కొద్దిగా ప్రశాంతంగా ఉండాలని భావించిన సమయంలో ఈ లీక్ వార్త పిడుగులా పడింది. ఇది విద్యార్థులకు భారీ షాక్‌గా మారింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. 2017, 2021, 2024లో కూడా ఇలాంటి అవకతవకల ఘటనలు వెలుగులోకి రావడం, ఇప్పటికీ పరిస్థితి మారకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. దేశంలో అత్యంత కీలకమైన పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేకపోవడం సిగ్గుచేటు.
ఈ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, భద్రత ఉండాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబొమని హెచ్చరించారు. ఇలాంటి సమయంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కాంగ్రేస్ పార్టీ అండగా ఉంటుందని ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా హామీ ఇచ్చారు.




