Duvvur: కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి!

Duvvur: వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ దువ్వూరు పీహెచ్‌సీ వద్ద సిబ్బంది ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 9 Oct 2026 8:56 AM IST
Duvvur
X

Duvvur: కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి!

Duvvur: వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన చేపట్టారు.

​ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్ బయన్న మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు తమకు ఉద్యోగ భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ప్రక్రియ ముగిసేవరకు 100 శాతం గ్రాస్ వేతనం, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారంతో పాటు కారుణ్య నియామకం కింద కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.

సమస్యలు పరిష్కరించకపోతే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. అనంతరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సురేష్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది మంజుల, స్వప్న, శశికళ, విజయ పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR