Proddatur: ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం!

Proddatur: ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ ఏర్పాటు వివాదంపై మండిపడ్డ ప్రవీణ్ కుమార్ రెడ్డి. మున్సిపల్ కమిషనర్‌పై హైకోర్టుకు వెళ్తామని తీవ్ర హెచ్చరిక.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 11 Oct 2026 5:55 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం!

Proddatur: ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ ఏర్పాటు వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. మున్సిపాలిటీ పరిధిలో వేలంపాట ద్వారా ఎగ్జిబిషన్ దక్కించుకున్నప్పటికీ, కొత్తపల్లి పంచాయతీ పరిధిలో మరో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంపై వివాదం చెలరేగింది. దీనిపై టీడీపీ మాజీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థైలో మండిపడ్డారు.

ప్రొద్దుటూరు కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అన్ని శాఖల అధికారుల నుంచి చట్టబద్ధమైన అనుమతులు కూడా తీసుకున్నామని టీడీపీ మాజీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తమ అనుచరుడు షణ్ముఖ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారని ఆయన తెలిపారు. ​అయితే, కొందరు సోషల్ మీడియాలో దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. నిబంధనల పేరుతో ఎగ్జిబిషన్‌ను అడ్డుకోవాలని చూస్తే ఊరుకోబోమని, మున్సిపల్ కమిషనర్‌పై హైకోర్టులో పిటిషన్ వేస్తామని ప్రవీణ్ తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR