Kadapa:ఆగస్టు 6 నుండి సీపీఐ 'జనచైతన్య ప్రచార పాదయాత్రలు'..

Kadapa: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6 నుండి 14 వరకు ఏపీ వ్యాప్తంగా సిపిఐ జనచైతన్య పాదయాత్రలు నిర్వహించనుంది.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 2 Aug 2026 5:38 PM IST
Kadapa
X

Kadapa:ఆగస్టు 6 నుండి సీపీఐ 'జనచైతన్య ప్రచార పాదయాత్రలు'..

కడప: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 6 నుండి 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా జనచైతన్య ప్రచార పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. హరినాథ్ రెడ్డి తెలిపారు.

ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ కడప నగర సమితి సమావేశానికి పి. హరినాథ్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పీపీపీ విధానంలో ప్రభుత్వ ఆస్తులను పణంగా పెట్టి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకుందామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పిపిపి) విధానం పేరుతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ, స్థానిక సంస్థల అధికారాలు, ఆర్థిక స్వయం ప్రతిపత్తిని బలహీనపరిచే చర్యలకు పాల్పడుతోంద న్నారు.ప్రజల ఆస్తులను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందనీ విమర్శించారు. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ స్ఫూర్తికి విరుద్ధమైన ఈ విధానాలను వెంటనే విరమించి, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు

రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 6 నుండి 15 వరకు జనచైతన్య ప్రచార పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాసంఘాలు, కార్మికులు, రైతులు, యువత, మహిళలు పెద్దఎత్తున ఈ జనచైతన్య ప్రచార పాదయాత్రల్లో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పాదయాత్రల నిర్వహణ, డివిజన్ ల వారీ ప్రచార కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఉద్యమ కార్యాచరణ, పార్టీ బలోపేతంపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, నగర కార్యదర్శి యన్ వెంకట శివ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్.నాగ సుబ్బారెడ్డి, జి.వేణుగోపాల్, కేసి బాదుల్లా, నగర సహాయ కార్యదర్శి ఉద్దే మద్దిలేటి,నగర కార్యవర్గ,సమితి సభ్యులు బ్రహ్మం, పగడపూల మల్లికార్జున, వడ్ల భాగ్యలక్షి,నాగరాజు, వేముల ఓబులేసు,చెంచయ్య,నరసింహులు, ఏసు రత్నం, నారాయణ, శివ నాగేంద్ర, పకిరప్ప,నరసమ్మ, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story