Badvel: శ్రీశైలం నీటితో బ్రహ్మం సాగర్ పోరుమామిళ్ల చెరువులను నింపాలి!

Badvel: బద్వేల్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించి, శ్రీశైలం నుంచి బ్రహ్మం సాగర్‌కు నీటిని విడుదల చేయాలని CPI(ML) లిబరేషన్ పార్టీ డిమాండ్ చేసింది.

B. ARUN KUMAR, BADVEL
Published on: 7 Aug 2026 12:36 PM IST
Badvel
X

Badvel: శ్రీశైలం నీటితో బ్రహ్మం సాగర్ పోరుమామిళ్ల చెరువులను నింపాలి!

Badvel: బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధి పట్ల పాలకుల నిర్లక్ష్యంపై భవిష్యత్తు ఉద్యమాలకు సిద్ధం.తక్షణమే శ్రీశైలం డ్యాం నుండి బ్రహ్మ సాగర్ కు నీటిని వదిలి బద్వేలు పోరుమామిళ్ల చెరువులను నింపాలి.బద్వేల్ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలి.

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ డిమాండ్.

ఎల్ నినో ప్రభావంతో వర్షపాతానికి నోచుకోని బద్వేల్ నియోజకవర్గాన్ని అత్యంత కరువు నియోజకవర్గంగా ప్రకటించి తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని మరియు శ్రీశైలం డ్యాం నుండి బ్రహ్మ సాగర్ కు నీటిని వదిలి పోరుమామిళ్ల బద్వేల్ చెరువులను నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్ ఎలిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం నియోజకవర్గ కార్యదర్శి చంద్రమోహన్ రాజు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, దశాబ్దాల తరబడి పాలకుల నిర్లక్ష్యం కారణంగా బద్వేల్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోక వెనుకబాటుకు గురైందని, బద్వేల్ అభివృద్ధికి నిధుల సాధన కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ త్వరలో ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నదని దీనికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎల్ నినో ప్రభావంతో తగినంత వర్షపాతం లేక బద్వేల్ నియోజకవర్గంలో కరువు ఛాయలు నెలకొన్నాయని తక్షణమే బద్వేల్ నియోజకవర్గంలోని మండలాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించి కరువు నివారణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

నియోజకవర్గంలో రైతాంగం ఇప్పటికే పంటలు వేయడానికి సిద్ధపడ్డారని తక్షణమే శ్రీశైలం డ్యాం నుండి బ్రహ్మ సాగర్ కు నీటిని వదిలి తద్వారా బద్వేలు పోరుమామిళ్ల చెరువులను నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. 2019లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం సోమశిల వెనుక జలాలను బద్వేల్ పెద్ద చెరువుకు తరలించి అట్లూరు గోపవరం బద్వేల్ మండలాల్లోని 33 చెరువులకు నీరు అందించాలని ఇచ్చిన జీవో నెంబర్ 197కు తక్షణమే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించి కూటమి ప్రభుత్వానికి బద్వేల్ రైతాంగం పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

త్వరలోనే సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో బద్వేల్ నియోజకవర్గం లో రైతాంగ చైతన్య యాత్రలను చేపట్టనున్నామని, ఈ యాత్రలో పాలకుల నిర్లక్ష్యాన్ని రైతాంగానికి వివరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నామని ఆయన తెలుపుతూ, ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు స్థానిక ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యాన్ని విడనాడి బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు సాధించి చూపాలని లేనిపక్షంలో రాబోయే ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఈ సమావేశంలో పార్టీ బద్వేల్ నియోజకవర్గ కార్యదర్శి పి చంద్రమోహన్ రాజు, జిల్లా కమిటీ సభ్యులు కే జకరయ్య నియోజకవర్గ కమిటీ సభ్యులు రామరాజు, విజయరావు, సంజీవ రాయుడు, జయరామరాజు, నారాయణ, చంద్రపాల్, పి వెంకటేశు, రమణ తదితరులు పాల్గొన్నారు

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story