Badvel: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి( సిపిఐ)
Badvel: బద్వేల్‌లో పెరిగిన గ్యాస్ ధరలపై సిపిఐ నిరసన. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత గ్యాస్ ధరలు పెంచి కేంద్రం ప్రజలను వంచిస్తోందని మండిపడ్డ వీరశేఖర్, బాలు.
Badvel: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి( సిపిఐ)
బద్వేల్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని బద్వేల్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ దగ్గర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేల్ పట్టణ సమితి ఆధ్వర్యంలో సిలిండర్లతో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ పట్టణ కార్యదర్శి పి.బాలు మాట్లాడుతూ........ కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే గ్యాస్ ధరలను పెంచి వేదారు ప్రజల పైన గుదిబండలా మారిందని చిరు వ్యాపారుల బతుకు బండిని కుదేలు చేస్తూ కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరను ఒకే సారు దాదాపు వెయ్యి రూపాయల వరకు పెంచడంతో ఈ గ్యాస్ నే ఆధారం చేసుకొని చిరు వ్యాపారాలు చేసుకుంటూ బతుకు బండిని ఈడుస్తూ జీవనోపాధి పొందుతున్న అనేక మంది జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని..ఎన్నికల ముందు వరకు ఎటువంటి గ్యాస్ కొరత లేదు.
మన దేశంపై యుద్ధ ప్రభావం లేదు ఎప్పటికప్పుడు గ్యాస్ సరఫరా అవుతుంది ధరలు పెంచము అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ప్రకటనలు ఇస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తవడమే తడవుగా కమర్సియల్ గ్యాస్ ధరలను పెంచుతూ దొడ్డిదారిన ప్రజలపై పెనుభారం మోపటం మొమ్మాటికి ప్రజలకు ద్రోహం చేయటమే అని అన్నారు. "అచ్చే దిన్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి, సామాన్యుడికి 'చచ్చే రోజులు' తెచ్చింది. తక్షణమే పెంచిన ధరలను తగ్గించకపోతే ఈ ఉద్యమం ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తుంది." అని హెచ్చరించారు పెంచిన వాణిజ్య గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. అలాగే గ్యాస్ సబ్సిడీని పునరుద్ధరించి నేరుగా వినియోగదారుల ఖాతాల్లో జమ చేయాలి. పెట్రోల్, డీజిల్ ధరలను అదుపులోకి తెచ్చి నిత్యావసరాల ధరలను తగ్గించాలి అని డిమాండ్ చేశారు.




