Kadapa: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం సీపీఐ కార్యదర్శి!

Kadapa: నీట్ పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్‌టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నిరసన చేపట్టింది.

G. RAVI KUMAR, KADAPA
Published on: 21 July 2026 7:23 PM IST
Kadapa
X

Kadapa: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం సీపీఐ కార్యదర్శి!

కడప: నీట్ పేపర్ వరుస లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు.చలో పార్లమెంట్ కార్యక్రమంలో విద్యార్థులపై దాడిని నిరసిస్తూ కడప అంబేద్కర్ సర్కిల్ లో సిపిఐ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ సోను వాంగ్ చుక్ పట్ల బిజెపి ఆర్ఎస్ఎస్ విష ప్రచారం చేస్తుందని,అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఏ)ను రద్దు చేసి పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.దేశ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ ఇంజనీర్, పర్యావరణవేత్త సోను వాంగ్చుక్ ఇరవై రోజులుగా ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కనీస మానవత్వం కూడా చూపకపోవడం అమానుషమన్నారు.

విద్యను హక్కుగా కాకుండా కార్పొరేట్ వ్యాపారంగా మార్చిన విధానాలే నేటి నీట్ కుంభకోణాలకు మూల కారణమని విమర్శించారు. ప్రభుత్వ విద్యను బలహీనపరిచి, కార్పొరేట్ విద్యాసంస్థలు, వేల కోట్ల రూపాయల కోచింగ్ సెంటర్ల వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని అన్నారు. కోచింగ్ మాఫియా, కార్పొరేట్ విద్యా వ్యాపారులు, పరీక్షల నిర్వహణలో ఉన్న అవినీతి వలయాలు కోట్ల రూపాయలు దోచుకుంటుంటే, వాటిని అరికట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం దారుణమన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాధ్యత వహించకుండా పదవులకు అతుక్కుపోవడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనన్నారు.

దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను లాఠీలతో అణచివేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తే అది పెద్ద పొరపాటే అని, ప్రజల ఆవేదనను లాఠీలతో అణచివేయడం ఏ ప్రభుత్వానికీ శాశ్వతంగా సాధ్యం కాదన్నారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA

Next Story