Badvel: మున్సిపాలిటీలో 15 ఏళ్లయినా శూన్యమైన అభివృద్ధి.. సీపీఐ ఆగ్రహం!
Badvel: దళితవాడల సమస్యలు పట్టించుకోని పాలకులపై సీపీఐ పట్టణ కార్యదర్శి బాలు ఆధ్వర్యంలో జేవీ భవనంలో ప్రెస్ మీట్ నిర్వహించి శ్వేతపత్రం డిమాండ్ చేశారు.
Badvel: మున్సిపాలిటీలో 15 ఏళ్లయినా శూన్యమైన అభివృద్ధి.. సీపీఐ ఆగ్రహం!
బద్వేల్: బద్వేల్ పట్టణం మున్సిపాలిటీగా ఏర్పడి 15. సంవత్సరాలు కావస్తున్న అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదని పంచాయతీగా ఉన్నప్పుడే అభివృద్ధి కనబడిందని,సిపిఐ పట్టణ కార్యదర్శి బాలు విలేకరుల సమావేశంలో మున్సిపాలిటీ అభివృద్ధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేల్ జేవి భవనం నందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బద్వేల్ అభివృద్ధి పైన మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత బద్వేల్ అభివృద్ధి కోసం ఒకసారి 130 కోట్లు ఒకసారి,100 కోట్లు నిధులు తెచ్చి బద్వేల్ అభివృద్ధి చేశామని చెబుతున్న అధికారులు పాలకపక్షం ప్రతిపక్షం. గొప్పలు చెప్పుకోవడం తప్ప అభివృద్ధి శూన్యం అన్నారు. ఈ మధ్యకాలంలో బద్వేల్ పట్టణ సుందరీకరణ పేరుతో 32 కోట్లు ఖర్చుపెట్టి వీధిలైట్లు డ్రైనేజీ కాలువలు పనులు ప్రారంభించాం. పనులు చేశామని చెబుతున్న అధికారులు ఈ వందల కోట్ల రూపాయలు ఎంత ఖర్చు చేశారు ? ఎక్కడ ఖర్చు చేశారు? దేనికి ఖర్చు చేశారు? అనేటువంటి శ్వేత పత్రం విడుదల చేయాలని వారు కోరారు. బద్వేలుని బాగా అభివృద్ధి చేసి ఉంటే చిల్డ్రన్స్ పార్కు, మినీ స్టేడియం, వాకింగ్ ట్రాక్ ఎక్కడ అని ప్రశ్నించారు.
పట్టణం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కొన్ని ప్రాంతాలకే అభివృద్ధా? దళితులు, ముస్లిం మైనార్టీలు, బీసీలు పేదలు నివాసం ఉన్నచోట అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని. బద్వేల్ పట్టణంలో దాదాపు పది దళితవాడలు ఉంటే దళిత వాడలకు స్మశానాల్లేవ్, స్మశానాలు ఉంటే రోడ్లు లేవు, కనీసం ప్రహరీ గోడలు కూడా లేనటువంటి పరిస్థితి బద్వేల్ మున్సిపాలిటీలో మనం చూస్తా వున్నాము.. అందుకనే బద్వేల్ అభివృద్ధి కోసం బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, దళిత సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు మైనార్టీ సంఘాలతో కలిపి ఒక వేదిక ఏర్పాటు చేయబోతున్నామని ఆవేదిక నిరంతరం బద్వేలు అభివృద్ధి పైన దృష్టి పెట్టి అధికారులను పాలక పక్షానికి ప్రశ్నించడానికి ఒక వేదిక ఏర్పాటు చేయబోతున్నామని,ఈ వేదికకు అన్ని పక్షాల నాయకులు సహరించాలని బద్వేల్ అభివృద్ధి కోసం కలిసి రావాలని కోరుతున్నాం.
ముందుగా విద్యార్థి, యువకులు, కలిసివచ్చి బద్వేల్ అభివృద్ధి కోసం కలిసి నడుద్దాం అభివృద్ధికి దోహదపడదాం అనేటువంటి పిలుపు బద్వేల్ పట్టణ అభివృద్ధికి ప్రధానంగా యువత నడుము బిగించాలని యువత ఇందులో భాగస్వాములై, అభివృద్ధి ప్రధానా జెండాగా ముందుకు సాగే విధంగా విద్యార్థులను, యువతను కూడగట్టుకుని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని, అవసరం అయితే పట్టణంలోని యువతతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధికి కృషి చేస్తామని, అధికారులను పాలకపక్షాలను, వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి పెదుళ్ళపల్లి బాలు. రూరల్ కార్యదర్శి ఇమ్మానియేల్. జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ. Aiyf పట్టణ కార్యదర్శి మునిరత్నం. సంఘమిత్ర వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దల పెంచలయ్య. దళిత నాయకులు ఓ ఎస్ వి ప్రసాద్. అంబేద్కర్ ఫూలే ఆశయ సాధన సమితి అధ్యక్షులు ముళ్లపాటి పిచ్చయ్య. తదితరులు పాల్గొన్నారు.




