Rayachoty: శ్రీకాంత్ రెడ్డికి అండగా దప్పేపల్లె యువత వైకాపా బలోపేతం!

Rayachoty: దప్పేపల్లె యువత మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, మోహన్ రెడ్డిలను కలసి పూర్తి మద్దతు తెలిపారు. వైఎస్‌ఆర్‌సిపి బలోపేతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 13 Aug 2026 3:00 PM IST
Rayachoty
X

Rayachoty: శ్రీకాంత్ రెడ్డికి అండగా దప్పేపల్లె యువత వైకాపా బలోపేతం!

Rayachoty: లక్కిరెడ్డిపల్లె మండలం దప్పేపల్లె గ్రామ యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. గురువారం రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం యర్రమరెడ్డిగారిపల్లెలోని వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డిలను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పార్టీపై తమకున్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన యువత.. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి, పార్టీ బలోపేతానికి యువత శక్తిని సమీకరిస్తామని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో చురుగ్గా భాగస్వాములమవుతామని తెలిపారు.

యువతే పార్టీకి బలమైన వెన్నెముక అని పేర్కొంటూ వారి ఉత్సాహం, నిబద్ధత పార్టీకి మరింత బలాన్నిస్తుందని శ్రీకాంత్ రెడ్డి, మోహన్ రెడ్డిలు అన్నారు. ప్రజలతో మమేకమై పార్టీ సిద్ధాంతాలను బలంగా ముందుకు తీసుకెళ్లాలని యువతకు సూచించారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story