Giddalur: గిద్దలూరును కరువు మండలంగా ప్రకటించాలని నిరసన!
Giddalur: గిద్దలూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తహశిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన - వినతిపత్రం అందజేత.
Giddalur: గిద్దలూరును కరువు మండలంగా ప్రకటించాలని నిరసన!
Giddalur: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహశిల్దార్ కార్యాలయం ముందు వివిధ ప్రజాసంఘాలు గిద్దలూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటిoచాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం మార్కాపురం జిల్లా సహాయ కార్యదర్శి వి రామకృష్ణ మాట్లాడుతూ 1966 కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ వర్షపాతంలో 25 శాతం కంటే తక్కువ, పొలాలు 50 శాతం కంటే తక్కువ సాగు కావడం, 33 శాతం మించి దిగుబడులు రాకపోవడం కరువు కు నిదర్శనం. ఈ మూడు పరిస్థితులు మండలంలో ఉన్నాయి.
మండలంలో 50 శాతం పొలాలు కూడా సాగు చేయలేదని, వర్షాభావ పరిస్థితుల వలన మెట్ట పొలాల్లో సాగుపంటలన్నీ ఎండిపోయాయి. బోర్ల కింద సాగులో ఉన్న పంటలు కూడా ఎండిపోయాయి.
దాదాపు 99% బోరు బావులు వట్టిపోయాయి. పశుగ్రాసం కూడా లభించటం లేదు గ్రామాల్లో తిరిగి రైతుల పరిస్థితి పరిశీలించినట్లయితే రైతుల పరిస్థితి దీనావస్థలో పంటలు పండక తిండిగింజలకు కూడా నోచుకోక రైతాంగం అనేక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారని, కనీసం కూలి పనులు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారనీ ఈ కరువు పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే స్పందించి గిద్దలూరు మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎలెక్షన్ డీ టి ఇబ్రహీం ఖలీల్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో పూర్ణ, గొర్రెలు - మేకల పెంపక సంఘం జిల్లా నాయకుడు, CITU మండల కన్వీనర్ బీ. నరసింహులు, ప్రజాసంఘాల నాయకులు D. శ్రీను, D. రూతమ్మ , M. మేరీ కుమారి, పెయింటింగ్ సంఘం తరపున మోషే, బాబురావు పాల్గొన్నారు.




