Mydukur: ఎల్ నానో ప్రభావంతో తీవ్ర కరువు ఎకరాకు ₹30 వేలు ఇవ్వాలి

Mydukur: కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి మైదుకూరులో రైతు సేవా సమితి అధ్యక్షుడు ఏవి. రమణ డిమాండ్.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 3 Sept 2026 7:49 PM IST
Mydukur
X

Mydukur: ఎల్ నానో ప్రభావంతో తీవ్ర కరువు ఎకరాకు ₹30 వేలు ఇవ్వాలి

Mydukur: ఎలిననో ప్రభావంతో వర్షాలు లేక కడప జిల్లా రైతు ఏ రకమైన పంటలు కూడా పెట్టలేదని వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న కడప జిల్లారైతును,రైతు కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సేవా సమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణ ఈరోజు మైదుకూరులో రైతులు, రైతు సేవాసమితి నాయకులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో రమణ మాట్లాడుతూ గత సంవత్సరం అధిక వర్షాలతో పెట్టిన పంట సరిగా పండగ , పండిన ఉల్లిపంటకు గిట్టుబాటు ధరలేక రైతు నష్టపోవడం జరిగిందని ఈ సంవత్సరం వర్షాలు లేక పంట పెట్టలేక రైతు ఇబ్బంది పడుతున్నాడని రాష్ట్రాన్ని పాలించిన పాలకులు జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే అధిక వర్షాలు వచ్చినప్పుడు.

ప్రాజెక్టులకు నింపుకొని పకృతి వైపరీత్యాల వల్ల వర్షాలు లేనప్పుడు రైతులకు ఉపయోగపడేవిని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వo జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు రాజోలి, జోలధరాశి , తెలుగు గంగ ప్రాజెక్టు లో అసంపూర్తిగా ఉన్న పంట, పిల్ల కాలవపనులు పూర్తికి నిధులు కేటాయించాలని, అలాగే ఈ సంవత్సరం రైతు తన జీవనోపాధిని కొనసాగించేందుకు ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వ 30 వేల రూపాయల సహాయం అంద జెసి ఆదుకోవాలని రమణ కోరారు.

ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు మండల, పట్టణ నాయకులు తిరువాయిపాటి నరసింహులు, మూలే రామచంద్రరెడ్డి, కానగూడూరు రామ్మోహన్, చెక్ పోస్ట్ శ్రీనివాసులు, దాసరెడ్డి గారి సుబ్బరాయుడు, సుమరతస సుబ్రహ్మణ్యం రాజాల రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story