Kadapa: కాష్ కొట్టు.. డిగ్రీ పట్టా పట్టు: బ్రహ్మంగారిమఠంలో విద్యా మాఫియా!
Kadapa: బ్రహ్మంగారిమఠంలోని ఒక డిగ్రీ కళాశాల 'పాస్ గ్యారంటీ' పేరుతో అక్రమాలకు పాల్పడుతోంది.
Kadapa: కాష్ కొట్టు.. డిగ్రీ పట్టా పట్టు: బ్రహ్మంగారిమఠంలో విద్యా మాఫియా!
Kadapa: మీకు డిగ్రీ పట్టా కావాలా అయితే కాష్ కొట్టు డిగ్రీ పట్టా పట్టు మిగతాదంతా మేము చూసుకుంటాం అన్న తీరుగా వ్యవహరిస్తుంది బ్రహ్మంగారి మఠం స్థానిక ఓ డిగ్రీ కళాశాల యాజమాన్యం అక్కడ అడ్మిషన్లు ఉంటాయి కానీ పిల్లలే ఉండరు అడ్మిషన్లు ఫుల్ కాఫీలు నిల్ అన్న తీరిగా వ్యవహరిస్తుంది ఆ కళాశాల యాజమాన్యం ప్రస్తుతము యోగి వేమన విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన డిగ్రీ సెమిస్టర్ కాల పట్టిక ప్రకారం ఈనెల అనగా ఏప్రిల్ 23 నుండి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కాలున్నాయి అయితే అదే సమయానికి బ్రహ్మంగారిమఠంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు 23 నుండి 28వ తేదీ వరకు జరగనున్నాయి ఆ సందర్భంలో ఇక్కడ లక్షలాదిమంది భక్తులు స్వామివారి గురుపూజ మహోత్సవానికి విచ్చేస్తారు ఆ జన సంద్రోహం నడుమ స్థానిక డిగ్రీ కళాశాలలో పరీక్షలు నిర్వహించడం విద్యార్థులకు ఒక రకమైన ఇబ్బందికరంగానే చెప్పవచ్చు ఎందుకనగా చుట్టూ వేలాది మైకు సీట్లతో సౌండ్ పొల్యూషన్ విపరీతంగా జరుగుతుంది.
అందునా డిగ్రీ కళాశాల చుట్టూ ఆలయాలు ఉండడం ఆలయాల్లో నిత్యం కూడా మైకుల్లో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భజనలు మారుమోగుతూ ఉంటున్న వేళ అదే సమయానికి డిగ్రీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆ సౌండ్ చాలా ఇబ్బందికరంగా కలిగిస్తుందని చెప్పవచ్చు అదికాక ఈ డిగ్రీ కళాశాల ఉన్నది కూడా ఒక నిత్య అన్నదాన సత్రంలో ఈ ఆరాధన గురు పూజ మహోత్సవాలకు అక్కడ నిత్యము కూడా వేలాదిమందికి భోజనాలు ఏర్పాటు చేస్తారు వందలాదిమంది భక్తులు ఆసత్రంలోనే బస కూడా చేస్తారు అలాంటి సందర్భంలో భక్తులు ఉన్నటువంటి సందర్భంలో ఎలా పరీక్షలు నిర్వహిస్తారు అనేటువంటిది ఒక ప్రశ్న అడిగి కనుగా ఉంది ఈ విషయాన్ని యోగివేమన విశ్వవిద్యాలయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు ఇంకా మా దృష్టికి ఈ విషయం రాలేదంటూ సమాధానం దాటవేస్తుండడం కోస మెరుపుగా చెప్పవచ్చు.
విద్యార్థులు నిల్ కాఫీలు ఫుల్
ఆ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ఉంటాయి కానీ విద్యార్థులు కళాశాల తరగతులకు కేవలం పదుల సంఖ్యలో మాత్రమే హాజరవుతారు అడ్మిషన్లు మాత్రం వందల సంఖ్యలో ఉంటాయి తీరా ఆరా తీస్తే అక్కడ సెల్ఫ్ సెంటర్ అని అడ్మిషన్లు చేర్చుకొని పాస్ గ్యారంటీ అంటూ యాజమాన్యం చెప్పడంతో దూరప్రాంతాల నుండి ఈ కళాశాలకు అడ్మిషన్లు వస్తున్నాయి అంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మాది సెల్ఫ్ సెంటర్ పాస్ గ్యారంటీ అంటూ ప్రచారం
మీకు డిగ్రీ పట్టా కావాలా అయితే మా కళాశాలలో చేరండి మాది సెల్ఫ్ సెంటర్ మాకు ఇక్కడే పరీక్ష కేంద్రం ఉంటుంది కనుక మీరు మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా పాస్ అవుతారంటూ ఆ యాజమాన్యం విద్యార్థులకు భరోసా కల్పించి దూరప్రాంతాలు ఉన్నా కూడా విద్యార్థులను చేర్పించుకుంటున్న వైనం ఇలా సెల్ఫ్ సెంటర్ తో అడ్మిషన్లు పొందడం ఎంతవరకు సమన్యసం అంటూ విద్యార్థుల సంఘాలవారు పడుతున్నారు.
ఈ కళాశాలపై పలుమార్లు విశ్వవిద్యాలయం వారికి విద్యార్థి సంఘాల ఫిర్యాదు
బ్రహ్మంగారిమఠంలోని డిగ్రీ కళాశాలలో వసతులు సరిగా లేవని విశ్వవిద్యాలయం నియమ నిబంధన మేరకు విద్యాసంస్థలను నడపడం లేదని సెల్ఫ్ సెంటర్ పేరుతో విద్యార్థుల దగ్గర అధిక ఫీజు వసూలు చేస్తూ తరగతుల నిర్వహించకుండా కేవలం ధనార్చనే వేయంగా వ్యవహరిస్తూ వ్యవస్థను మేనేజ్ చేస్తూ వేలకు వేల రూపాయలు వసూలు చేసుకుంటూ డిగ్రీ కళాశాల యాజమాన్యం డబ్బు సంపాదిస్తున్న విషయాన్ని పలు విద్యార్థి సంఘాలు పలుమార్లు విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులకు తెలియచెప్పిన విశ్వవిద్యాలయం అధికారులను కూడా ఇక్కడున్న ప్రిన్సిపాల్ మేనేజ్ చేస్తూ నియమ నిబంధనలను దొంగలు తొక్కుతున్నాడు అంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఆరాధనకు మైక్ సెట్ పొల్యూషన్ ఉన్న పరీక్షలు ఎలా నిర్వహిస్తారు
ఒకపక్క ఆరాధన గురు పూజ మహోత్సవాలు లక్షలాదిమంది జనం వందలాది మైక్ సెట్ లు సౌండ్ పొల్యూషన్ ఫుల్ మరొక పక్క ఊరికి నడిబొడ్డున దేవాలయాలకు కూత వేటు దూరంలో డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ఇలాంటి సందర్భంలో ఇంత రద్దీ ఉన్న పరిస్థితులలో సౌండ్ పొల్యూషన్ అధికంగా ఉన్న నేపథ్యంలో ఎలా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు అంటూ విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి దానికి బదులు బ్రహ్మంగారిమఠంలోని మరొక ప్రత్యామ్నాయ కళాశాలను ఊరికి దూరంగా ఉన్న వాటిని ఎంచుకొని పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులకు మంచి చేకూరుతుందని విద్యార్థి సంఘాల ఆరోపిస్తున్నాయి.
నిత్య అన్నదాన సత్రంలో డిగ్రీ కళాశాలకు పర్మిషన్ ఇవ్వొచ్చా
అదో నిత్యాన్నదాన సత్రం నిత్యం కూడా భక్తుల తాకిడి ఉంటుంది అలాంటి సత్రంలో డిగ్రీ కళాశాలకు విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు ఎలా పరిమిషన్ ఇచ్చారు నియమ నిబంధనలు తుంగలో తొక్కి ఎలా డిగ్రీ కళాశాలకు అనుమతి ఇచ్చారు అంతుచిక్కని ఆంతర్యం డిగ్రీ కళాశాల నిర్వహించడమే తప్పు అయితే అందున అక్కడ మళ్లీ సెల్ఫ్ సెంటర్ కు అనుమతులు మంజూరు ఇందులో యోగివేమన విశ్వవిద్యాలయం అధికారుల పాత్ర ఎంత ఉందో నీకు తేల్చాల్సిన వైనం ఉందంటూ విద్యార్థి సంఘాలు మండిపాటు.
సత్రం నిర్వాహకులు ఖాళీ చేయాలంటూ మొర
స్థానిక డిగ్రీ కళాశాల ఉన్న ఆ సత్రం యజమానులు గతంలో డిగ్రీ కళాశాలకు ఇచ్చిన సమయం గత ఏడాది అనగా 2025 సంవత్సరమే ముగిసిందని మేము పలుమార్లు మా సత్రాన్ని ఖాళీ చేయండి అన్నా కూడా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మా మాటలు లెక్కపెట్టకుండా వ్యవహరిస్తున్నాడని ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లగా మా విశ్వబ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ వారు కలుగజేసుకొని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లగా స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో ఈ నెలలో ఖాళీ చేయాలంటూ వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందని వారు చెప్పుకొచ్చారు.
యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ వివరణ
యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థ అయిన స్థానిక శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల వ్యవహారం విద్యార్థి సంఘాలు కొందరు పాత్రికేయ మిత్రులు యోగివేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ రాజ శేఖర్ గారి దృష్టికి తీసుకెళ్లగా తాను గత కొద్దికాలంలోనే ఛార్జ్ తీసుకున్నానని ఈ కళాశాల వ్యవహారం ఇప్పటివరకు నా దృష్టికి రాలేదని ఈ పరీక్షల నిర్వహణ విషయం కూడా ఇటు ఆరాధన ఉందని లక్షలాదిమంది భక్తులు వస్తారని మైక్ సెట్ పొల్యూషన్ అధికంగా ఉంటుందన్న విషయం తమ దృష్టికి రాలేదని వెంటనే ఈ విషయాన్ని తమ పరీక్షలు నిర్వహణ అధికారైన కృష్ణారావుతో సంప్రదించి కళాశాలపై చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.




