Madanapalle: మదనపల్లె టీడీపీలో జోష్.. దేవల మురళికి ఘన సత్కారం
Madanapalle: మదనపల్లె రాజకీయాల్లో సందడి: టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా దేవల మురళి రెండోసారి బాధ్యతలు.
Madanapalle: మదనపల్లె టీడీపీలో జోష్.. దేవల మురళికి ఘన సత్కారం
Madanapalle: మదనపల్లె పార్లమెంట్ కార్యాలయంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు దేవల మురళికి మదనపల్లె లో ఘన సన్మానం నిర్వహించారు. ఇటీవల ఆయనను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా రెండవసారి నియమించడంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవల మురళి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి మరోసారి అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, ప్రజా సేవకు మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ దేవరింటి శ్రీనివాసులు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మేకల రెడ్డి శేఖర్, పుల్లగంటి కొండ్రెడ్డి, డాక్టర్ జెరుపిటి మల్లికార్జున, పూజారి అంజి, ఒలిపి సుధాకర్, వేమనారాయణతో పాటు మదనపల్లె తెలుగుదేశం పార్టీ నాయకులు, వడ్డెర సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మదనపల్లె నాయకులు దేవల మురళిని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.




