Rayachoti: రాయచోటి పట్టణాభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తాం!
Rayachoti: రాయచోటి మున్సిపల్ చైర్మన్ బోనుమాల ఖాదరవలిని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభినందించారు. మున్సిపాలిటీలో 44 స్థానాలూ ఏకగ్రీవం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.
Rayachoti: రాయచోటి పట్టణాభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తాం!
Rayachoti: అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా రాయచోటికి విచ్చేసిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాయచోటి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన బోనుమాల ఖాదరవలిని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
రాయచోటి మున్సిపాలిటీలో కూటమి 44కు 44 స్థానాలను ఏకగ్రీవంగా సాధించడం విశేషమని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో రాయచోటి పట్టణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.




