Mydukur: వనిపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన DMHO!

Mydukur: కడప జిల్లా మైదుకూరు వనిపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. పి. యుగంధర్.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 19 Sept 2026 1:23 PM IST
Mydukur
X

Mydukur: వనిపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన DMHO!

Mydukur: కడప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, డా. పి. యుగంధర్ ఆధ్వర్యంలో ఈరోజు వనిపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య మరియు ఆరోగ్య సేవలను సమగ్రంగా పరిశీలించడం జరిగింది. ఇటీవల ప్రజల నుంచి ఆరోగ్య సేవలకు సంబంధించి ప్రతికూల అభిప్రాయాలు/ఫిర్యాదులు అందిన నేపథ్యంలో, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు, మందులు, పరీక్షలు మరియు అవసరమైన ఆరోగ్య సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా అందేలా చూడాలని వైద్యాధికారులు మరియు సిబ్బందికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్పష్టమైన సూచనలు జారీ చేశారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా. శ్రీకాంత్ మరియు ఇతర వైద్య సిబ్బందితో సేవల అమలు, రోగుల పట్ల స్పందన, OP సేవలు, మందుల లభ్యత, ల్యాబొరేటరీ సేవలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి ప్రతికూల అభిప్రాయాలు రావడానికి కారణాలను గుర్తించి, వాటిని తక్షణమే సరిదిద్దాలని సూచించారు.

ప్రతి ఒక్కరికి సమయానుకూలంగా, బాధ్యతాయుతంగా, నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, సమయపాలన లోపం లేదా ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం ఉండకూడదని సూచించారు.

అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో పనిచేస్తున్న ANMs, CHOs, ఇతర ఫీల్డ్ సిబ్బంది యొక్క కార్యక్రమాల ప్రగతిని పరిశీలించడం జరిగింది. మాతా శిశు ఆరోగ్యం, ఇమ్యునైజేషన్, NCD స్క్రీనింగ్, హైరిస్క్ కేసుల గుర్తింపు మరియు ఫాలోఅప్, ఆరోగ్య కార్యక్రమాల అమలు తదితర అంశాలపై ఫీల్డ్ స్థాయి ప్రగతిని సమీక్షించారు.

ప్రతి సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలు/సచివాలయాల పరిధిలో ఆరోగ్య కార్యక్రమాలను లక్ష్యాల మేరకు పూర్తి చేసి, సంబంధిత పోర్టల్స్‌లో డేటాను సమయానికి నమోదు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బద్వేల్ డివిజన్ ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. మల్లేష్, జిల్లా మలేరియా అధికారి డా. ఆరిపుల్ల, జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా.మొహమ్మద్ తాహా, జిల్లా ఎపిడమిక్ సెల్ సూపర్వైజర్లు ప్రసాద్, రాఘవ, తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR