T Sundupalle: వీరుపాక్షేశ్వర స్వామి ఆలయానికి రెండు గోమాత దూడల విరాళం

T Sundupalle: టి.సుండుపల్లి వీరుపాక్షేశ్వర స్వామి ఆలయానికి 2 గోమాత దూడల విరాళం. రైతులను అభినందించిన జనసేన నేత రామా శ్రీనివాస్. గో సంరక్షణపై పిలుపు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 17 Aug 2026 8:37 AM IST
T Sundupalle
X

T Sundupalle: వీరుపాక్షేశ్వర స్వామి ఆలయానికి రెండు గోమాత దూడల విరాళం

T Sundupalle: టి.సుండుపల్లి శ్రీ వీరుపాక్షేశ్వర స్వామి వారి ఆలయానికి టి.సుండుపల్లి మండలం రాయవరం గ్రామపంచాయతీ రాయవరం కస్పాకు చెందిన నల్లయ్య మరియు సుబ్రమణ్యం గార్లు వారి ఇంట పోషిస్తున్న గోమాతల సంబంధించిన రెండు గోమాత దూడలను వారి కుటుంబ సమేతంగా ఆలయ పురోహితులు హరిక్రిష్ణ స్వామి కమిటీ సభ్యులు భక్తాదుల సమక్షంలో అప్పగిస్తున్న కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న రామా శ్రీనివాస్.

ఈ సందర్భంగా జనసేన నేత రామా శ్రీనివాస్ మాట్లాడుతూ రాయవరం నల్లయ్య మరియు సుబ్రమణ్యం గార్ల ఇంట గోవులకు పుట్టిన తరుపులను నేటి తరంలో వారి కుటుంబ సభ్యులు మన సమాజానికి ఆదర్శంగా నిలిచారంటూ మనమంతా దైవంగా కొలుచుకునే గోమాతలను సంరక్షించుకుందామని గోవులను ఎటువంటి పరిస్థితులలో గోవదలు జరగకుండా స్వస్తి పలుకుద్దామంటూ వాటి అభివృద్ధి కొరకు సనాతన ధర్మం ఆచరించే వారంతా భాగస్వాములై గోవులను మరింత అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story