Rayachoti: పేద కుటుంబ వివాహానికి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆర్థిక సాయం!
Rayachoti: రాయచోటిలో పేద కుటుంబ వివాహానికి మండిపల్లె నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా టీడీపీ నాయకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు.
Rayachoti: పేద కుటుంబ వివాహానికి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆర్థిక సాయం!
Rayachoti: రాయచోటి నియోజకవర్గం రాయుడు కాలనీకి చెందిన బుక్కే శ్యాం నాయక్ గారి కుమార్తె వివాహం సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు సహాయం కోరారు.
వారి అభ్యర్థన మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లె లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు, మండిపల్లె నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వివాహ ఖర్చులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్న వారికి తన వంతు సహాయం అందిస్తున్న డాక్టర్ మండిపల్లె లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.




