Rayachoti: ఉత్తమ సేవల కోసం ప్రశంసా పత్రం అందుకున్న డీఎస్పీ కృష్ణ మోహన్

Rayachoti: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న రాయచోటి డీఎస్పీ కృష్ణ మోహన్. అభినందించిన పోలీస్ అధికారులు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 15 Aug 2026 11:50 PM IST
Rayachoti
X

Rayachoti: ఉత్తమ సేవల కోసం ప్రశంసా పత్రం అందుకున్న డీఎస్పీ కృష్ణ మోహన్

రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ విధులు నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రశంసిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా రాయచోటి డివిజన్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ కృష్ణ మోహన్ ఉత్తమ సేవలకు గుర్తింపుగా అన్నమయ్య జిల్లా మదనపల్లె పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ దీరజ్ కునుబిల్లి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ కృష్ణ మోహన్ మాట్లాడుతూ, 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ అందించిన ప్రశంసా పత్రాన్ని అందుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ గౌరవాన్ని తన సేవా ప్రయాణంలో మరింత అంకితభావంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించేందుకు ప్రేరణగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ, పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేలా కృషి చేస్తానని డీఎస్పీ కృష్ణ మోహన్ పేర్కొన్నారు. ఉత్తమ విధులకు లభించిన ఈ గుర్తింపు పోలీసు సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని, సేవా స్ఫూర్తిని నింపుతుందని అధికారులు తెలిపారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story