Duvvur: పుల్లారెడ్డిపేట వసతి గృహాల విద్యార్థులకు దోమతెరల పంపిణీ!

Duvvur: దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేటలోని కేజీబీవీ, ఎస్సీ బాలుర వసతి గృహాల విద్యార్థులకు శుక్రవారం ప్రత్యేక క్రిమిసంహారక దోమతెరలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 13 Nov 2026 5:54 PM IST
Duvvur
X

Duvvur: పుల్లారెడ్డిపేట వసతి గృహాల విద్యార్థులకు దోమతెరల పంపిణీ!

దువ్వూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పుల్లారెడ్డిపేటలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV), ఎస్సీ బాలుర వసతి గృహాల్లో విద్యార్థినీ, విద్యార్థులకు లాంగ్ లాస్టింగ్ ఇన్సెక్టిసైడల్ నెట్స్ (LLINs) కార్యక్రమం కింద ప్రత్యేక క్రిమిసంహారక దోమతెరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి నరసింహారెడ్డి వసతి గృహాల అధికారులకు దోమతెరలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, ఫైలేరియా వంటి వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రత్యేక క్రిమిసంహారక మందుతో తయారుచేసిన ఈ దోమతెరలను విద్యార్థులు ప్రతిరోజూ రాత్రి నిద్రించే సమయంలో తప్పనిసరిగా వినియోగించాలని తెలిపారు. దోమల నివారణకు పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, నీటి తొట్టెలు, డ్రమ్ములు, కూలర్లు తదితర ప్రదేశాలను తరచూ శుభ్రపరచాలని సూచించారు.

అలాగే జ్వరం, చలి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు హాస్టల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు జనార్దన్ రావు, రవికుమార్,ఏ ఎన్ ఎమ్ మాధవీలత మరియు కేజీబీవీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR