Duvvur: దువ్వూరులో ఎంపీటీసీ ముసాయిదా పోలింగ్‌ కేంద్రాల జాబితా విడుదల!

Duvvur: వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలంలో ఎంపీటీసీ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను ఎంపీడీవో జవహర్ బాబు విడుదల చేశారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 16 Sept 2026 6:02 PM IST
Duvvur
X

Duvvur: దువ్వూరులో ఎంపీటీసీ ముసాయిదా పోలింగ్‌ కేంద్రాల జాబితా విడుదల!

​దువ్వూరు, మైదుకూరు: రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా దువ్వూరు మండల పరిధిలోని ఎంపీటీసీ స్థానాల ముసాయిదా (డ్రాఫ్ట్‌) పోలింగ్‌ కేంద్రాల జాబితాను రూపొందించినట్లు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) సి.ఎ. జవహర్‌ బాబు తెలిపారు. బుధవారం స్థానిక మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

​ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలోని అన్ని ఎంపీటీసీ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేయనున్న పోలింగ్‌ కేంద్రాల వివరాలు, ప్రతిపాదిత మార్పులు, అక్కడ కల్పించిన భౌతిక వసతుల వివరాలను రాజకీయ పార్టీల నాయకులకు చదివి వినిపించారు. ఈ జాబితాపై ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలు లేదా సలహాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

అభ్యంతరాలు వచ్చిన పోలింగ్‌ కేంద్రాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తుది జాబితాను ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో కె. హరికృష్ణతో పాటు మండలంలోని ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR