Duvvur: చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు - 53 కొవ్వొత్తులతో నిరసన
Duvvur: దువ్వూరులో చంద్రబాబు 53 రోజుల జైలు నిర్బంధానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ కన్వీనర్ బోరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన.
Duvvur: చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు - 53 కొవ్వొత్తులతో నిరసన
దువ్వూరు: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమ కేసులో 53 రోజుల పాటు జైలులో నిర్బంధించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా దువ్వూరు మండల కేంద్రంలో టీడీపీ శ్రేణులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టాయి. చంద్రబాబు జైలు జీవితం గడిపిన 53 రోజులకు ప్రతీకగా మండల నాయకులు 53 కొవ్వొత్తులు వెలిగించి ఆయనకు తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అప్పట్లో చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల్లో చంద్రబాబుకున్న ఆదరణను తగ్గించలేకపోయారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దువ్వూరు మండల టీడీపీ కన్వీనర్ బోరెడ్డి రమణారెడ్డి, పట్టణ ఇంచార్జ్ పాపినేని రాంబాబు, కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ కోనేటి హరినాథ్, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు మైనార్టీ నాయకులు బందే ఖాన్, భాషా మోదీన్, వై. గౌస్, బి. హుస్సేన్ పీరా, జీ. ఖాదర్, నాయకులు అందే శ్రీనివాసులు, కటారు కృష్ణయ్య, అర్ధాకుల వీరయ్య, కొట్టే శేషయ్య తదితర మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




