Duvvuru: రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌గా దువ్వూరు వాసి శ్రీనివాసులు

Duvvuru: దువ్వూరు వాసి ఆకుల శ్రీనివాసులుకు రైల్వేలో పదోన్నతి. LDCE పరీక్ష ద్వారా ADSTE (గ్రూప్-బి గెజిటెడ్) ఆఫీసర్‌గా ఎంపిక.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 20 Aug 2026 6:46 AM IST
Duvvuru
X

Duvvuru: రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌గా దువ్వూరు వాసి శ్రీనివాసులు

Duvvuru: దువ్వూరు మండల కేంద్రానికి చెందిన ఆకుల శ్రీనివాసులు రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తు, అసిస్టెంట్ డివిజనల్ సిగ్నల్ అండ్ టెలికమ్యునికేషన్ ఇంజనీర్ గా పదోన్నతి పోందారు, ఉమ్మడి దక్షిణ మధ్య రైల్వే సంకేత మరియు దూరసంచార్ విభాగంలో పనిచేస్తున్న పలువురు సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు ఎల్‌డిసిఇ పరీక్షల ద్వారా గ్రూప్-బి క్యాడర్(గెజిటెడ్) అధికారులుగా ఎంపికయ్యారు.

వీరిలో కడపజిల్లా, దువ్వూరు మండల కేంద్రం, ఇందిరానగర్ కాలనికీ చెందిన ఆకుల శ్రీనివాసులు( s/o చింతరపల్లి రామయ్య) జనరల్ కేటగిరీ కింద ఎంపికయ్యారు.

2009 సం. సిగ్నల్ టెక్నీషియన్-II, టెలికాం టెక్నీషియన్-III, రైల్వే గార్డ్ గా శ్రీనివాసులు ఎంపిక కాగ, వీటిలో సిగ్నల్ టెక్నీషియన్ పోస్ట్ ఎంచుకుని, తర్వాత అంచెలంచెలుగా, జూనియర్ ఇంజినీర్, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ గా పదోన్నతి పొంది, సికింద్రాబాద్, గుంతకల్ డివిజన్లలో పనిచేసారు, ఇప్పుడు ఎల్డీసీఈ ( లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్) పరీక్షలో వ్రాత, ముఖాముఖి పరీక్షలోనూ ఉత్తమ ప్రదర్శన చేసి (ఏడిఎస్టీఈ) అసిస్టెంట్ డివిజనల్ సిగ్నల్ అండ్ టెలికమ్యునికేషన్ ఇంజనీర్ గ్రూప్ బి, గెజిటెడ్ ఆఫిసర్ గా పదోన్నతి పొందారు.

దువ్వూరు గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాసులు రైల్వే లో ఉన్నత పదవి చేపట్టడం పట్లు వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story