Duvvuru: దువ్వూరు: కానగూడూరు అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాలు

Duvvuru: వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం కానగూడూరు అంగన్‌వాడీ కేంద్రంలో సేవా సంకల్ప అభియాన్, పోషణ మాసంలో భాగంగా అంగన్‌వాడీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 26 Sept 2026 7:26 PM IST
Duvvuru
X

Duvvuru: దువ్వూరు: కానగూడూరు అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాలు

​దువ్వూరు: దువ్వూరు మండలం కానగూడూరు అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 7 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవ సంకల్ప అభియాన్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మూడు రోజుల పాటు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా 9వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమంతో కలిపి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

​ఈ ఉత్సవాల ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులకు అందుతున్న పౌష్టికాహారం, మాతృ సంరక్షణ, టీకాలు మరియు సామాజిక సేవలపై లబ్ధిదారులకు సమగ్ర అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, వాటి ద్వారా పొందిన ప్రయోజనాలు, అనుభవాలపై లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరికృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అంగన్వాడీ సేవల విస్తరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.

పోషణ్ ట్రాకర్‌లో లబ్ధిదారుల వివరాల నమోదు, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, బేటీ బచావో - బేటీ పఢావో, ప్రసూతి సమయంలో అందించే ప్రత్యక్ష నగదు బదిలీ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది మరియు గ్రామ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR