Duvvuru: చింతకుంటలో మాబు సుభాని దర్గా గార్మీ వేడుకలు!
Duvvuru: దువ్వూరు మండలం చింతకుంటలో మాబు సుభాని దర్గా గార్మీ పండుగ బండలాగుడు పోటీల్లో మార్తల చంద్రఓబుళరెడ్డి ఎద్దుల జోడి ప్రథమం, రూ.50 వేల నగదు బహుమతి కైవసం.
Duvvuru: చింతకుంటలో మాబు సుభాని దర్గా గార్మీ వేడుకలు!
మైదుకూరు, దువ్వూరు: దువ్వూరు మండలం చింతకుంట గ్రామంలో వెలసిన మాబు సుభాని దర్గా గార్మీ (జెండా) పండుగ గురువారం అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి వేళ గ్రామంలో భక్తులు జెండాను మేళతాళాలతో ఘనంగా ఊరేగించారు.
పండుగ పురస్కరించుకుని గురువారం నిర్వహించిన ఓల్డ్ కేటగిరీ విభాగం ఎద్దుల బండలాగుడు పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ పోటీల్లో ప్రొద్దుటూరు మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన మార్తల చంద్రఓబుళరెడ్డి ఎద్దులు బండను 5,970 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచి రూ. 50 వేల నగదు బహుమతిని కైవసం చేసుకున్నాయి.
అలాగే కడప మండలం ఓబుళంపల్లెకు చెందిన సతీష్ కుమార్ రెడ్డి ఎద్దులు 5,838 అడుగులు లాగి ద్వితీయ బహుమతి (రూ. 40,000), ఏర్రిపల్లెకు చెందిన విజయ్ కుమార్ రెడ్డి మరియు అనంతపురం జిల్లా ఎదురూరుకు చెందిన నరేష్ చౌదరిల ఎద్దులు 5,269 అడుగులు లాగి తృతీయ బహుమతి (రూ. 30,000) సాధించాయి. బాలయ్యగారిపల్లెకు చెందిన విఘ్నవర్ధన్ రెడ్డి, చెర్లోపల్లెకు చెందిన నవదీప్ రెడ్డిల ఎద్దులు 5,210 అడుగులు లాగి నాల్గో బహుమతి (రూ. 20,000) గెలుపొందాయి.
నంద్యాల జిల్లా బిల్లాపురానికి చెందిన భుమ్మా గోవర్ధన్ రెడ్డి ఎద్దులు 5,062 అడుగులు లాగి ఐదో స్థానం (రూ. 15,000), చినరంగపురానికి చెందిన విషాంత్ వర్ధన్ రెడ్డి, ఏర్రిపల్లెకు చెందిన విజయ్ కుమార్ రెడ్డిల ఎద్దులు 4,590 అడుగులు లాగి ఆరో స్థానం (రూ. 11,000) దక్కించుకున్నాయి.
పోటీలు ముగిసిన అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో విజేతలకు నగదు పురస్కారాలను అందజేశారు. ఈ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.




