Duvvuru: మోహినిదేవి అవతారంలో దువ్వూరు వాసవీ కన్యకాపరమేశ్వరి దివ్య దర్శనం
Duvvuru: దువ్వూరు శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి శాలలో శరన్నవరాత్రుల 9వ రోజు అమ్మవారు మోహినిదేవి దివ్య అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Duvvuru: మోహినిదేవి అవతారంలో దువ్వూరు వాసవీ కన్యకాపరమేశ్వరి దివ్య దర్శనం
దువ్వూరు: స్థానిక అమ్మవారి శాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజైన సోమవారం శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు మోహినిదేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఆలయంలోని మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తిని మోహిని అవతారంలో సర్వాంగసుందరంగా అలంకరించారు.
ఈ విశేష అలంకారాన్ని తిలకించేందుకు దువ్వూరుతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణలతో మారుమోగింది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన వసతులు కల్పించి, తీర్థప్రసాదాలు అందజేసినట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆరవేటి సుబ్బారావు తెలిపారు.
మంగళవారం విజయదశమి సందర్భంగా ఆలయంలో విజయలక్ష్మి దేవి అలంకారం, శమీ దర్శనం (జమ్మి పూజ) తో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మండల పరిధిలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆర్యవైశ్య కమిటీ సభ్యులు కోరారు.




