Duvvuru: దువ్వూరు మండలంలో ఎంపీటీసీ ఓటర్ల జాబితా విడుదల!
Duvvuru: దువ్వూరు మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాల ఫోటో ఓటర్ల జాబితా విడుదల చేసిన ఎంపీడీవో జవహర్ బాబు అభ్యంతరాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచన.
Duvvuru: దువ్వూరు మండలంలో ఎంపీటీసీ ఓటర్ల జాబితా విడుదల!
Duvvuru: మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా దువ్వూరు మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఫోటో ఓటర్ల జాబితాలను శుక్రవారం అధికారికంగా ప్రచురించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ నెం. 515/SEC-B1/2026 మార్గదర్శకాలు, పంచాయతీరాజ్ చట్ట నిబంధనల మేరకు ఈ జాబితాలను సిద్ధం చేసినట్లు మండల అధికారులు తెలిపారు. ప్రజలు, ఓటర్ల పరిశీలన నిమిత్తం ఈ జాబితాలను దువ్వూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయంతో పాటు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు.
ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తొలగింపులు, వివరాల సవరణలు లేదా ఇతర అభ్యంతరాలు ఏవైనా ఉంటే సంబంధిత ఫారాల ద్వారా తగిన ఆధారాలతో వెంటనే అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. గ్రామీణ ప్రాంత ఓటర్లు తమ పేర్లను స్థానిక పంచాయతీ కార్యాలయాల్లో సరిచూసుకోవాలని కోరారు.




