Duvvuru: దువ్వూరు పీహెచ్సీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
Duvvuru: దువ్వూరు హరిజనవాడలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, రోగులకు మందులు పంపిణీ చేసి అబేట్ పిచికారీ చేపట్టారు.
Duvvuru: దువ్వూరు పీహెచ్సీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
దువ్వూరు: పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డులో ఉన్న హరిజనవాడలో దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది కాలనీలో పర్యటించి, దోమల లార్వా అభివృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి అబేట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ప్రజలకు దోమలు, కలుషిత నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై అవగాహన కల్పించి, వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
కాలనీలోని ప్రధాన రహదారిపై పైప్లైన్ లీకేజీల కారణంగా నీరు నిల్వ ఉండటంతో పాటు, రఘురామయ్య ఇంటి పక్క వీధిలో బురద, మురుగునీరు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైప్లైన్ లీకేజీలను అరికట్టి, మురుగునీటిని తొలగించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆప్తాల్మిక్ ఆఫీసర్ చంద్రమౌళి, ఆరోగ్య పర్యవేక్షకురాలు రాజేశ్వరమ్మ, ఆరోగ్య సహాయకులు జనార్దన్ రావు, రవికుమార్, ఏఎన్ఎం నిర్మల, ఆశా కార్యకర్త వెంకటసుబ్బమ్మ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




