Duvvuru: పెద్ద బకరాపురంలో పశు ఆరోగ్య శిబిరం ఉచిత వైద్య సేవలు!
Duvvuru: దువ్వూరు మండలం పెద్ద బకరాపురంలో పశు ఆరోగ్య శిబిరం. పశువైద్యాధికారి డాక్టర్ రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పశువులు, జీవాలకు ఉచిత చికిత్స, మందుల పంపిణీ.
Duvvuru: పెద్ద బకరాపురంలో పశు ఆరోగ్య శిబిరం ఉచిత వైద్య సేవలు!
Duvvuru: దువ్వూరు మండలంలోని పెద్ద బకరాపురం గ్రామపంచాయతీలో పశు ఆరోగ్య శిబిరాలు ఈ రోజు కానగూడూరు పశు వైద్యాధికారి డా|| రవీంద్ర రెడ్డి అద్వర్యం లో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ శిబిరం లో 9పశువులకు గర్భకోశవ్యాధులకు చికిత్స, 28దూడలకు న ట్టల నివారణమందులు, 31సాదారణ చికిత్స, 481గొర్రెలు&మేకలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. అలాగే పశు భీమా, లింగ నిర్దారణ వీర్యం గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ లక్ష్మి కాంత్ , అనిమల్ హస్బెండ్రి అసిస్టెంట్స్ అరిఫ్ , సుప్రజ,మహిత , రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి అమీర్, మరియు ,పాడి రైతులు, జీవాల సంరక్షకులు పాల్గొన్నారు.




