Kadapa: డీఎంహెచ్‌ఓ నాగరాజును సస్పెండ్ చేయాలి.. డీవైఎఫ్ఐ డిమాండ్!
Kadapa: కడప జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్ల అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్న డీఎంహెచ్‌ఓ నాగరాజు.
Kadapa: డీఎంహెచ్‌ఓ నాగరాజును సస్పెండ్ చేయాలి.. డీవైఎఫ్ఐ డిమాండ్!
కడప: కడప జిల్లా లోని ప్రైవేటు ఆసుపత్రుల పై,ఆర్ఎంపీ ల పై,నిబంధనలు పాటించని డయాగ్నొస్టిక్ సెంటర్ల పై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న డిఎంహెచ్ఓ నాగరాజు పై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని DYFI జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల.శివకుమార్ లు తెలిపారు. శనివారం జిల్లా పర్యటనలో భాగంగా కడప కు వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
Next Story




