Kadapa: ఊరగాయల వీధిలో ప్రత్యేక ఆకర్షణగా వడ్ల గణనాథుడు!
Kadapa: కడప ఊరగాయల వీధిలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా వడ్ల గింజలతో వినూత్న గణపతి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు.
Kadapa: ఊరగాయల వీధిలో ప్రత్యేక ఆకర్షణగా వడ్ల గణనాథుడు!
కడప: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా వినూత్న రీతిలో గణనాథుడిని తయారు చేసి పూజించారు. కడపలో వడ్ల గింజలతో గణపతి విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్టించారు.కడప ఊరగాయల వీధిలో వడ్ల గింజలతో తయారు చేసిన గణపతిని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
కాలుష్యానికి ఏమాత్రం హాని కలగకుండా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ప్రతి ఏడాది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనాలతో కూడిన రంగులతో తయారయ్యే విగ్రహాలకు భిన్నంగా తమ బృందం సభ్యులే స్వయంగా పర్యావరణహితంగా గణపతిని రూపొందిస్తున్నట్లు చెప్పారు.పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.




