Kadapa: పొలాల్లో వైర్ల చోరీ.. గ్రామస్తుల చాకచక్యంతో దొరికిన దొంగ
Kadapa: కడప జిల్లా దువ్వూరు మండలం మీర్జాఖాన్ పల్లెలో విద్యుత్ మోటార్ల వైర్లను దొంగిలిస్తున్న ముఠాను గ్రామస్తులు పట్టుకున్నారు.
Kadapa: పొలాల్లో వైర్ల చోరీ.. గ్రామస్తుల చాకచక్యంతో దొరికిన దొంగ
Kadapa: కడప జిల్లా దువ్వూరు మండలంలోని మీర్జాఖాన్ పల్లె గ్రామ సమీపంలో విద్యుత్ మోటార్ల వైర్లను దొంగిలిస్తున్న ముఠా గుట్టును గ్రామస్తులు రట్టు చేశారు. బుధవారం తెల్లవారుజామున పొలాల్లో మోటార్ వైర్లను కత్తిరిస్తున్న ముగ్గురు దొంగలను గమనించిన రైతులు, గ్రామస్తులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.
గ్రామస్తులు చుట్టుముట్టడంతో దొంగలు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక దొంగను గ్రామస్తులు చాకచక్యంగా పట్టుకోగా, మిగిలిన ఇద్దరు వ్యక్తులు చీకటిని ఆసరాగా చేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. గ్రామస్తుల అప్రమత్తతను పోలీసులు ఈ సందర్భంగా అభినందించారు. వ్యవసాయ పనుల వేళ మోటార్ వైర్ల చోరీలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు, ఈ ఘటనతో కొంత ఊరట లభించినట్లయింది. ఈ కేసుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




