Duvvur: దువ్వూరు విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరసన
Duvvur: విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై దువ్వూరులో స్ట్రగుల్ కమిటీ సమావేశం. 15న తిరుపతిలో మహా ధర్నాకు పిలుపు. వేతన సవరణ, పెండింగ్ బకాయిల చెల్లింపులకు డిమాండ్.
Duvvur: దువ్వూరు విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరసన
దువ్వూరు: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ, ఈరోజు మధ్యాహ్నము 1.30 గంటలకు స్థానిక దువ్వూరు సెక్షన్ ఆఫీసు నందు స్ట్రగుల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నాయబ్ రసూల్ హాజరవ్వడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ యాజమాన్యం ప్రభుత్వం, విద్యుత్ ఉద్యోగుల దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చేపట్టామని వారు తెలిపారు.
అందులో భాగంగా, ఈనెల 15 వ తేదీన ఎస్ పి డి సి ఎల్ ఆపీసు, తిరుపతి వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మైదుకూరు డివిజన్ ఉపాధ్యక్షులు ఎన్ వి రమణ మాట్లాడుతూ, వేతన సవరణ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని, పెండింగ్ లో ఉన్న 4 కరువు భత్యం బకాయిలు చెల్లించాలని, కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగులర్ చేయాలనీ, ఆయన డిమాండ్ చేశారు.
డివిజన్ ఉపాధ్యక్షులు వరదా రెడ్డి, కృష్ణారెడ్డి మాట్లాడుతూ, డిస్కం పరిధిలోని పెండింగ్ లో వున్న ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. మైదుకూరు డివిజన్లో ఓ అండ్ ఎం కార్మికుల ప్రమోషన్లు వెంటనే కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
స్ట్రగుల్ కమిటీ డివిజన్ నాయకులు నరసింహ, శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతు టాటా ఏ ఐ జి పాలసీ చాలా అధ్వానంగా ఉందని ఈ పాలసీ మీద యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే పాత పెన్షన్ అమలు చేయాలని, వారు డిమాండ్ చేశారు. చలో తిరుపతి కార్యక్రమానికి మైదుకూరు డివిజన్ లోని కాంట్రాక్టు మరియు రెగ్యులర్ ఉద్యోగులు యొక్క సంఖ్యలో పాల్గొనాలని వారు తెలియజేశారు.
ఈ సమావేశంలో మైదుకూరు డివిజన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డివిజన్ సభ్యులు బి.సుబ్బారెడ్డి, రఘురాం రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు తెలంగాణ తరహాలో 48 వేల రూపాయలు జీతం చెల్లించాలని ఆయన తెలిపారు అపరిమిత మెడికల్ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు షరతులు లేకుండ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జయసింహ, కృష్ణ చంద్రారెడ్డి, తాహిర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.




