Sundupalli: కడపలో ఏనుగుల బీభత్సం.. పంటలు, తోటలు ధ్వంసం!
Sundupalli: కడప జిల్లా సుండుపల్లి మండలం ముడుంపాడులో ఏనుగుల గుంపు బీభత్సం. మామిడి, కొబ్బరి తోటలు, డ్రిప్ పరికరాలను ధ్వంసం చేసిన ఏనుగులు.
Sundupalli: కడపలో ఏనుగుల బీభత్సం.. పంటలు, తోటలు ధ్వంసం!
కడప జిల్లా: సుండుపల్లి మండలం ముడుంపాడు గ్రామంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఉన్న మామిడి తోటల్లోకి ప్రవేశించి మామిడి చెట్లు, కొబ్బరి చెట్లను, వరి పంటలు, మోటర్లు, డ్రిప్పు పరికరాలు ను ధ్వంసం చేశాయి.
మామిడి తోటలకు చుట్టూ ఏర్పాటు చేసిన ముళ్ల రాతి కూసాలు, కంచెను సైతం తొక్కి నాశనం చేశాయి. దీంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఏనుగుల దాడిలో దెబ్బతిన్న మామిడి తోటలను పరిశీలించారు.
ఏనుగుల గుంపు సంచారంతో అటు రైతులు, ఇటు అటవీ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Next Story




