Mydukur: హైవే పెట్రోలింగ్ పోలీసులమంటూ దోపిడీ: ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

Mydukur: బ్రహ్మంగారిమఠం వద్ద హైవే పెట్రోలింగ్ పోలీసులమంటూ వాహనదారులను బెదిరించి దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను మైదుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 12 Sept 2026 9:13 PM IST
Mydukur
X

Mydukur: హైవే పెట్రోలింగ్ పోలీసులమంటూ దోపిడీ: ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

మైదుకూరు: బ్రహ్మంగారిమఠం మండలంలోని మేము హైవే రూట్ పెట్రోలింగ్ పోలీసులమని చెప్పి బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.బెంగళూరుకు చెందిన ఐచర్ వాహన డ్రైవర్లను అడ్డుకుని "గంజాయి కేసులు పెట్టి జైలుకు పంపుతాం" అంటూ ఫైబర్ లాఠీ చూపించి బెదిరించి, వారి వద్ద నుండి మొబైల్ ఫోన్ లాక్కున్నారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బి.మఠం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఈ కేసులో రాబడిన సమాచారం మేరకు కడపకు చెందిన పాలకీర్తి కిరణ్, అతని బంధువు పాలకీర్తి శ్యామ్ బాబులను ఈరోజు లింగాలదిన్నె పల్లె క్రాస్ రోడ్ వద్ద అరెస్టు చేసి,వారి వద్ద నుండి ఒక కారు,శాంసంగ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, రూరల్ సీఐ శివశంకర్, బ్రహ్మంగారిమఠం ఎస్ఐ శివప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR