Rayachoti: రూ.270 బస్తా రూ.450 వరకు విక్రయం.. రైతుల ఆవేదన!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో యూరియా బ్లాక్ మార్కెట్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 5 Aug 2026 12:59 PM IST
Rayachoti
X

Rayachoti: రూ.270 బస్తా రూ.450 వరకు విక్రయం.. రైతుల ఆవేదన!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో రైతుకు రూ270 అందవలసిన యురియాను కొంతమంది వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్ లో రూ 350 నుండి 450 వరకు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.పంటలు సాగు చేసిన రైతులు యురియా కోసం సచివాలయాల చుట్టూ తిరుగుతున్న వారికి కేవలం ఒక ప్యాకెట్ మాత్రమే యూరియా ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారని రైతులు వాపోతున్నారు.

రైతులకు అవసరమయ్యే యూరియా ఇవ్వడం లేదని,ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ , జిల్లా శాఖ అధికారులు స్పందించి బ్లాక్ మార్కెట్ను అరికట్టి రైతులకు సరైన ధరకు యూరియా అందేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అవసరమయ్యే యూరియా ఉందని ప్రకటనలు ఇస్తున్నప్పటికీ అవి ప్రకటనలు లాగే మిగిలిపోయాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story