Annamayya: చిన్నమండెం వండాడి వద్ద ఘోర ప్రమాదం వ్యక్తి అక్కడికక్కడే మృతి
Annamayya: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం వండాడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. గుర్తుతెలియని వాహనం ఢీకొని పత్తి సుధాకర్ అక్కడికక్కడే మృతి.
Annamayya: చిన్నమండెం వండాడి వద్ద ఘోర ప్రమాదం వ్యక్తి అక్కడికక్కడే మృతి
Annamayya: చిన్నమండెం మండలం వండాడి వద్ద శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని రైల్వే కోడూరు నియోజకవర్గం అంకమ్మనగర్‌కు చెందిన పత్తి సుధాకర్‌గా పోలీసులు గుర్తించారు.
ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై చిన్నమండెం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Next Story




