Badvel: ఫాతిమా స్కూల్ పదో తరగతి టాపర్లకు పురస్కారాలు, లీడర్ల ప్రమాణ స్వీకారం!
Badvel: గోపవరం ఫాతిమా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల టాపర్లకు ప్రతిభా పురస్కారాలు. ఫాదర్ ఆరోగ్య రాజు చేతుల మీదుగా బహుమతుల ప్రదానం.
Badvel: ఫాతిమా స్కూల్ పదో తరగతి టాపర్లకు పురస్కారాలు, లీడర్ల ప్రమాణ స్వీకారం!
Badvel: గోపవరం మండలం ఫాతిమా ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ఈరోజు అనగా శనివారం ఉదయం 2025-26 విద్యా సంవత్సరానికి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు
1)ఎస్ వర్షిత
2) గురుతేజ మరియు
3) సల్వార్ ఫాతిమాలకు మన బద్వేలు ఫాతిమా మాత విచారణ గురువులు అయినటువంటి ఫాదర్ ఆరోగ్య రాజు గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం ఇవ్వడం జరిగింది అలాగే పాఠశాలలో 2026- 27 విద్యా సంవత్సరానికి గాను spl, aspl ఎలక్షన్లు జరిపి గెలిచిన వారికి కిరీట ధారణ చేసి వారు చేయవలసిన పనులను వారి చేత ప్రమాణం చేయించారు. తర్వాత ఫాదర్ ఆరోగ్య రాజు మాట్లాడుతూ లీడర్ అంటే నాయకత్వం మాత్రమే కాదు, తన వాళ్లపైన తనకున్న బాధ్యత అని చెప్పారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన అటువంటి ప్రమాణం ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల చేత చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిష, సిస్టర్ సోఫీ , ముఖ్య అతిథులుగా ఫాదర్ ఆరోగ్యరాజ్, ఫాదర్ దిలీప్ ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు విద్యార్థులు అందరూ కూడా ఉత్సాహంతో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని అంతటినీ ఎ.న్సీ.సీ విద్యార్థులు తమదైన క్రమశిక్షణ కవాతు నిర్వహించి కార్యక్రమాన్ని అంతటిని ఎన్సిసి మరియు పిఈటి మాస్టర్ల ఆధ్వర్యంలో క్రమశిక్షణతో నడిపించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమాన్ని ముగించారు.




