Duvvur: అనుమతి లేకుండా గ్రావెల్ తరలిస్తే కఠిన చర్యలు!
Duvvur: దువ్వూరు మండలం నీలాపురం కొండ ప్రాంతంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ఐదు టిప్పర్లకు రూ.35 వేల జరిమానా విధించిన తహశీల్దార్ సునీత.
Duvvur: అనుమతి లేకుండా గ్రావెల్ తరలిస్తే కఠిన చర్యలు!
Duvvur: మండల పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ తరలిస్తే ఎంతటి వారిపై అయినా కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ సునీత హెచ్చరించారు. మండలంలో ఎక్కడైనా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
గురువారం నీలాపురం కొండ ప్రాంతం నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రెవెన్యూ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఐదు టిప్పర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వాటిలో గ్రావెల్ లోడుతో ఉన్న రెండు టిప్పర్లకు ఒక్కో దానికి ₹10,000 చొప్పున, లోడింగ్ కోసం సిద్ధంగా ఉన్న మిగిలిన మూడు ఖాళీ టిప్పర్లకు ఒక్కొక్క దానికి ₹5,000 వంతున మొత్తం ₹35,000 జరిమానా విధించినట్లు తేలిపారు.
ఎవరైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతులు తీసుకున్న తర్వాతే గ్రావెల్ తరలించాలని, నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని తేలిపారు . ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ నాగస్వరూప్, భూ సర్వే డిప్యూటీ తహశీల్దార్ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




