Pulivendula: తొండూరు గురుకులంలో ఫుడ్ పాయిజన్..30 మంది విద్యార్థినులకు అస్వస్థత!
Pulivendula: వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా దాదాపు 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
Pulivendula: తొండూరు గురుకులంలో ఫుడ్ పాయిజన్..30 మంది విద్యార్థినులకు అస్వస్థత!
Pulivendula: తొండూరులోని అంబేద్కర్ బాలికల గురుకుల శనివారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత దాదాపు 30 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురై చికిత్స కోసం తొండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ మధ్యకాలంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాస్టల్ నిర్వహణపై పదేపదే ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెక్కినట్టు వ్యవహరించడం దారుణo,ఇటీవల బాత్రూంలో నిర్వహణ సరిహలేదని ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు టీసీలు తీసుకొని హాస్టల్ వదిలి వెళ్ళిపోయారు.
ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న అధికారుల పర్యవేక్షణ మాత్రం పూర్తిగా కొరబడింది అధికారులను అడుగుదామన్న అందుబాటులో ఉండరు ఉన్నవారు సరిగా సమాధానం చెప్పరు విద్యార్థుల తల్లిదండ్రులకు విలేకరులకు విద్యార్థి సంఘాలకు ప్రవేశం లేదని చెప్తూ విద్యార్థుల ఆరోగ్యాలతో వారి జీవితాలతో చలగాటమాడుతున్న అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
దాదాపు 500 మంది పైగా విద్యార్థినిలు ఆశ్రయం పొందుతున్న గురుకుల పాఠశాలలో కనీస సౌకర్యాలు బాత్రూంలో మంచి త్రాగునీరు పరిశుభ్రమైన డైనింగ్ హాలు లాంటి వసతులు కూడా కల్పించలేని అధికారులు వారి వ్యక్తిగత గొడవలతో మాత్రం నిత్యం బిజీగా ఉంటున్నారని సమాచారం వారి డ్యూటీల విషయంలో ఉన్న మనస్పర్ధలతో పిల్లల భద్రతను గాలికి వదిలేసారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా బాధ్యులైన అధికారులపై విచారం జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




