Rayachoti: హామీలను వెంటనే నెరవేర్చాలని రాయచోటిలో వైఎస్సార్‌సీపీ దీక్షలు!
Rayachoti: రాయచోటి బంగ్లా వద్ద వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలకు మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
Rayachoti: హామీలను వెంటనే నెరవేర్చాలని రాయచోటిలో వైఎస్సార్‌సీపీ దీక్షలు!
Rayachoti: యువత, విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటి బంగ్లా ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు మూడో రోజు ఆయన సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీ–2025 నియామకాలపై సమగ్ర విచారణ జరిపి అనుమానాలను నివృత్తి చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాయచోటి జిల్లా కేంద్ర హోదా పునరుద్ధరణకు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరిస్తే ప్రజల తరఫున పోరాటం మరింత ఉధృతం చేస్తామని, యువత భవిష్యత్తు కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం ఆగదని రమేష్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.




