Rayachoti: ఈ నెల 23న ఏషియన్ హాస్పిటల్ ఉచిత మెగా వైద్య శిబిరం!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆగస్టు 23న ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 13 Aug 2026 7:39 PM IST
Rayachoti
X

Rayachoti: ఈ నెల 23న ఏషియన్ హాస్పిటల్ ఉచిత మెగా వైద్య శిబిరం!

రాయచోటి: ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 23వ తేదీన రాయచోటి పట్టణంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు హాస్పిటల్ ఏవో ప్రవీణ్ కుమార్ తెలిపారు.కడప నగరంలోని శంకరాపురం మెయిన్ రోడ్డులో బ్లైండ్ స్కూల్ ఎదురుగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడాది కాలంగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తోంది.

మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రాయచోటిలో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అత్యాధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో నిర్వహించనున్న ఈ శిబిరంలో ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు, వైద్యుల సలహాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన క్రీడా శాఖ, రవాణా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని హాస్పిటల్ ఏవో ప్రవీణ్ కుమార్, రాయచోటి జనసేన నాయకులు నిమ్మనపల్లి పవన్ కుమార్ కలిసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story